top of page

కొత్తపల్లె పంచాయతీలో సర్వసభ్య సమావేశం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Feb 10, 2023
  • 1 min read

Updated: Feb 11, 2023

కొత్తపల్లె పంచాయతీలో సర్వసభ్య సమావేశం

ree
అజెండాలోని అంశాలను చదువుతున్న కార్యదర్శి గురు మోహన్

వై.వైస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


మేజర్ పంచాయతి అయిన కొత్తపల్లె పంచాయతి కార్యాలయం నందు కార్యదర్శి గురు మోహన్ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశానికి ఈఓపీఆర్డీ, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, ఉప సర్పంచ్ ఇందిరమ్మ, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు హాజరుకాగా, ఎంమ్మెల్సీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందుచేత అజెండాలో పొందుపరచిన తొంబైమూడు అంశాలకు గాను అటు ప్రజలకు ఇటు నాయకులకు అనుసంధానముగా ఉన్న పది అంశాలకు సభ్యలు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా సెక్రటరీ గురు మోహన్ మాట్లాడుతూ మేజర్ పంచాయతీగా ఉన్న కొత్తపల్లెను అభివృద్ధి పధంలో నడిపించటానికి తనవొంతు కృషి చేస్తానని, అందుకు ఎంపీటీసీలు, వార్డు మెంబర్ల సహాయ సహకారాలు కావాలని, నిధులలేమి లేని కారణంగా అభివృద్ధి కుంటుపడదని, త్వరితగతిన పంచాయతీ పరిధిలో జరుగుతున్న గృహ, వాణిజ్య నిర్మాణాల ప్లాన్ మంజూరుకు కృషి చేస్తున్నామని ఆయన తెలిపారు. అనంతరం సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున అజెండాలో పొందుపరచిన పలు కీలక అంశాలను ఆమోదించలేదని, రాబోవు సమావేశం నందు ఆమోదించబడని అంశాలను, నూతన అంశాలను అజెండాలో చేర్చి చర్చకు తీసుకువస్తామని, సమావేశానికి హాజరైన వార్డు మెంబర్లకు కృతజ్ఞతలు తెలియచేసారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page