top of page

వైసీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు సస్పెండ్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 1, 2022
  • 1 min read

వైసీపీ నుంచి మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడిని సస్పెండ్


ఆ పార్టీ అధినేత , సీఎం వైఎస్ జగన్. తనకు వ్యక్తిగత ఓటింగ్ ఉందని నిన్న కొత్తపల్లి వ్యాఖ్యానించారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న జగన్ ఆయనను సస్పెండ్ చేశారు. క్రమశిక్షణ కమిటీ సిఫారసుతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ree

కాగా.. కొత్తపల్లి సుబ్బారాయుడు తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం నుంచి 1989 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీచేసి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. వరుసగా నాలుగుసార్లు అక్కడ నుంచే విజయం సాధించి తిరుగులేని నేతగా ఎదిగారు. చంద్రబాబు కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. అయితే 2009 ఎన్నికల సమయంలో టీడీపీని వీడి పీఆర్పీలో చేరిన ఆయన.. నర్సాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి నర్సాపురం నుంచి మళ్లీ విజయం సాధించారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page