జగన్ చిత్రపటానికి పాలాభిషేకం
- PRASANNA ANDHRA

- Feb 1, 2024
- 1 min read
జగన్ చిత్రపటానికి పాలాభిషేకం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం నందు, గురువారం ఉదయం సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి నేతృత్వంలో డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జగన్ నిలువెత్తు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, తమ కుటుంబ ఆర్థిక స్వావలంబనకు డ్వాక్రా పునాదిగా నిలిచిందంటూ, రుణాలు, వడ్డీల మాఫీలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ మహిళలు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, దాదాపు మూడుకోట్ల ఆరు లక్షల రూపాయల ఆసరా నిధులు ఈ విడత డ్వాక్రా మహిళల ఖాతాలో జమ చేయడం జరిగినదని ఆయన తెలిపారు. మొత్తం 554 సంఘాలకు గాను ప్రస్తుతానికి 405 సంఘాలకు నాలుగవ విడత ఆసరా డబ్బులు చెల్లింపు జరిగినదని, మిగులు సంఘాలకు త్వరలో చెల్లింపులు రానున్నట్లు తెలిపారు. గడచిన ఐదు సంవత్సరాల వ్యవధిలో తమ పంచాయితీ పరిధిలోని డ్వాక్రా సంఘాలకు దాదాపు 12 కోట్ల 26 లక్షల రూపాయల మేర చెల్లింపులు చేశారని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని డ్వాక్రా సంఘాల మహిళలు పాల్గొన్నారు.









Comments