అర్హులందరికీ సంక్షేమ పథకాలు - సర్పంచ్ కొనిరెడ్డి
- PRASANNA ANDHRA

- Nov 28, 2023
- 1 min read

వైఎస్ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఆంధ్రప్రదేశ్ కు జగనే ముఖ్యమంత్రి ఎందుకు కావాలి కార్యక్రమంలో భాగంగా కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అధ్యక్షతన వివేకానంద నగర్ కే3 సచివాలయ పరిధి నందు మంగళవారం సాయంత్రం ఎంపీపీ శేఖర్ యాదవ్ పాల్గొని ఇక్కడి ప్రజలను ఉద్దేశించి వారికి వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా అందిన లబ్ధిని వివరించారు. అనంతరం సర్పంచ్ కొనిరెడ్డి మాట్లాడుతూ, కే3 సచివాలయ పరిధిలో దాదాపు 42 కోట్ల 40 లక్షల రూపాయల సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరిందని, గడచిన నాలుగున్నర సంవత్సరాల కాలంలో అభివృద్ధి, సంక్షేమం, మౌలిక వసతుల కల్పనలో వైసీపీ ముఖ్య పాత్ర పోషించిందని, అర్హులందరినీ లబ్ధిదారులుగా గుర్తించి సంక్షేమ పథకాలు అమలు చేసిందని ఆయన గుర్తు చేశారు. అనంతరం సచివాలయ పరిధిలో ఏర్పాటు చేసిన వైసిపి జెండాను ఆయన ఆవిష్కరించారు. కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, వార్డు వాలంటీర్లు, పలువురు వైసీపీ నాయకులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.









Comments