పంచాయతీల అభివృద్దే వైసీపీ ప్రభుత్వ ధ్యేయం - రాచమల్లు
- PRASANNA ANDHRA

- Jan 31, 2023
- 1 min read

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ అమృత నగర్ 17వ వార్డు నందు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా ఆధ్వర్యంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. 17వ వార్డు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున బాణాసంచా పేల్చి ఎమ్మెల్యే రాచమల్లుకు పుష్పగుచ్చాలు అందించి సాదర స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాచమల్లు గడప గడపకు తిరిగి వార్డులోని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీల అభివృద్దె ధ్యేయంగా వైసిపి ప్రభుత్వం ముందుకు సాగుతోందని, అందులో భాగంగానే కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని అమృత నగర్ నందు మౌలిక సదుపాయాల కల్పన చురుగ్గా సాగుతోందని, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పంచాయతీ అభివృద్ధి వేగవంతం అయిందని ఆయన అభిప్రాయపడ్డారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, ఎంపీపీ శేఖర్ యాదవ్, అప్కాబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ, నియోజకవర్గ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, గజ్జల కళావతి, ఎంపీటీసీలు సౌభాగ్యమ్మ, డిష్ శ్రీను, వార్డ్ మెంబర్లు మోషే, సుమలత, నాటక మండలి చైర్మన్ బండారు సూర్య నారాయణ, టీటీడీ బోర్డు మెంబెర్ మారుతీ ప్రసాద్, వైసీపీ నాయకులు కాకర్ల నాగశేషా రెడ్డి, రాయపురెడ్డి, కొనిరెడ్డి వాసు, కొనిరెడ్డి హర్ష, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అమృతానగర్ ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు.








Comments