కొత్తపల్లెలో సీసీ రోడ్ల నిర్మాణం
- PRASANNA ANDHRA

- May 9, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు స్థానిక కొత్తపల్లె పంచాయతీ కొత్తపల్లె గ్రామం నందు నూతన సీసీ రోడ్ల నిర్మాణానికి భూమిపూజ నిర్వహించిన, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి కుమారుడు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కొత్తపల్లె పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, అందులో భాగంగా నేడు కొత్తపల్లె గ్రామం నందు గల ముస్లిం స్మశాన వాటికకు వెళ్లే దారిలో, అలాగే పలు వీధులలో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను దాదాపు ఇరవై లక్షల రూపాయల పంచాయతీ నిధుల కేటాయింపుతో నిర్మాణ పనులు చేపట్టామని తెలిపారు. అలాగే రాబోవు రోజుల్లో ముస్లిం శ్మశానవాటిక ప్రహారీగోడ నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు, పంచాయతీ పరిధిలోని ప్రజలకు ఎల్లవేళలా తాము అందుబాటులో ఉంటూ, పంచాయతీ అభివృద్దే ధ్యేయంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ పుల్లారెడ్డి, కాంట్రాక్టర్ షరీఫ్, రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.








Comments