కొత్తపల్లి స్మశాన వాటికకు ప్రహరీ నిర్మాణం
- PRASANNA ANDHRA

- Feb 1, 2024
- 1 min read
కొత్తపల్లి స్మశాన వాటికకు ప్రహరీ నిర్మాణం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ, కొత్తపల్లి గ్రామం నందు ముస్లిం మైనారిటీలకు కేటాయించిన స్మశాన వాటికకు దాదాపు 12 లక్షల రూపాయల వ్యయంతో, నలుదిక్కుల నూతన ప్రహరీ గోడ నిర్మించగా గురువారం ఉదయం సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి స్మశాన వాటిక ప్రహరీ పనులు పూర్తయి రంగులు దిద్దుకొన్న స్మశాన వాటిక ను ముస్లిం మైనారిటీ పెద్దల సమక్షంలో పర్యవేక్షించారు. అనంతరం కొత్తపల్లి గ్రామంలోని మదర్సాను సందర్శించి అక్కడి మౌలిక వసతులను పరిశీలించారు. అనంతరం మైనారిటీ పెద్దలు కొనిరెడ్డికి శాలువా కప్పి, పూలమాలవేసి సన్మానించారు కార్యక్రమంలో 13వ వార్డు మెంబర్ కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, తిరుపాల్ రెడ్డి, పలువురు వైసిపి నాయకులు, కొత్తపల్లి గ్రామ ప్రజలు, మైనారిటీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









Comments