బిజెపి జిల్లా కార్యదర్శికి అవమానం
- EDITOR

- 6 days ago
- 1 min read
బిజెపి జిల్లా కార్యదర్శికి అవమానం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
శుక్రవారం, ప్రొద్దుటూరు నియోజకవర్గ టౌన్ వన్ అధ్యక్షులు వంకధార నరేంద్ర అధ్యక్షతన జరిగిన పాత్రికేయ సమావేశానికి రాష్ట్ర మార్క్ ఫెడ్ డైరెక్టర్ అలాగే రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి వంగల శశి భూషణ్ రెడ్డి హాజరుకాగా, స్థానిక వై.ఎమ్.ఆర్ కాలనీలోని బిజెపి కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైయస్సార్ కడప జిల్లా బిజెపి కార్యదర్శి కొర్రపాటి కంబగిరి రావు కు ఘోర పరాభవం జరిగింది. నియోజకవర్గస్థాయి నేతలను, నాయకులను గౌరవించిన సదరు నాయకులు జిల్లాస్థాయి నాయకుడైన కంబగిరిరావును విస్మరించటం, పాత్రికేయుల సమావేశం జరుగుతున్నప్పుడు వెనక వరుసలో కండువా వేసి నిలబెట్టి చోద్యం చూశారు. కనీసం వెనుక వరుసలో ఆయనకు ఒక కుర్చీ కూడా ఏర్పాటు చేయలేదని పార్టీలోని నాయకులు, క్రియాశీలక కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు, పత్రికల ద్వారా సమావేశం తిలకించి చదివిన ప్రజలు కూడా పార్టీలో అతన్ని చిన్నచూపు చూడటం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాస్థాయిలో పార్టీ తనను తన సేవలను గుర్తించి జిల్లా కార్యదర్శిగా పదవి ఇచ్చినప్పటికీ పార్టీలోని కొందరు ఇలా తనను చిన్నచూపు చూడటంపై కంబగిరి రావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నియోజకవర్గంలో బిజెపి నాయకులు గ్రూపు తగాదాలు గ్రూపులు కట్టడం జిల్లా స్థాయి నాయకులను చిన్నచూపు చూడటం మానుకోవాలని, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పార్టీలోని కొందరు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు.









ఆయనకు కూర్చోమనే చెప్పారు కానీ ఆయన పార్టీ మీటింగ్ కాబట్టి అభిమానంతో నిల్చున్నాడు
ఆయన కంటే ముందు బీజేపీ పార్టీకి 5యేండ్లు సేవచేసిన వారికే లేవు పదవులు
మీరేమో ఆయన పార్టీకి చేసిన సేవకు జిల్లా కార్యదర్శి ఇచ్చారాని వ్రాశారు మరి
మీరు సొంతంగా ఉహించుకుని వ్రాశారా ఈ వార్త. ..