రేపు రాజుకుంట సచివాలయాన్ని సందర్శించనున్న కొరముట్ల
- DORA SWAMY

- Apr 6, 2022
- 1 min read

రేపు రాజుకుంట సచివాలయాన్ని సందర్శించనున్న కొరముట్ల - వాలంటరీ లకు సన్మాన కార్యక్రమం. అందరూ పాల్గొని జయప్రదం చేయాలన్న మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి.

రేపటి రోజున గురువారం ఉదయం 10 గంటలకు ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు... గ్రామస్థాయిలో ప్రజలకు, ప్రభుత్వానికి వారధులుగా ఉంటూ ప్రజా సంక్షేమం అందించడంలో భాగస్వాములై నిబద్ధతతో విధులను నిర్వహిస్తున్న వాలంటరీ లకు ప్రోత్సాహక నగదు మరియు ప్రశంసా పత్రాన్ని అందించేందుకు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, అధికారుల, వాలంటరీ ల పని తీరు, ప్రజా సంక్షేమ పథకాల పై స్పందనలను ప్రజల నుంచే నేరుగా తెలుసుకోనున్న నేపథ్యంలో.. రాజుకుంట సచివాలయాన్ని సందర్శించనున్నారని.

కనుక ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు, కార్యకర్తలు, అభిమానులు,ప్రజలందరూ పాల్గొనాలని చిట్వేలు మండలం కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి తెలియపరిచారు.








Comments