గృహ లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టండి: ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
- DORA SWAMY

- Mar 3, 2022
- 1 min read
జగనన్న కాలనీల కింద మంజూరైన నూతన గృహాలను వీలైనంత త్వరగా నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు అన్నారు.
ఈరోజు సాయంత్రం రైల్వే కోడూరు మండలం రెడ్డి వారి పల్లి గ్రామ పంచాయతీ నందు నూతనంగా మంజూరైన జగనన్న లేఅవుట్ల లబ్ధిదారులతో మాట్లాడుతూ నిర్మాణానికి సంబంధించిన ఇసుక,కంకర, ఇనుము, తాపీ మేస్త్రీల కూలీలు ప్రభుత్వం సమకూరుస్తుందని.. కావున ప్రతి ఒక్క లబ్ధిదారుడు స్వచ్ఛందంగా గృహ నిర్మాణాలు చేపట్టాలని ఆయన అన్నారు. అవసరమైతే అదనంగా డ్వాక్రాగ్రూపు లోని మహిళలకు గృహ నిర్మాణానికి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయని ఆయన అన్నారు. తదనంతరం పూర్తయిన ఇంటిని పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో తాహాసిల్దారు రామ్మోహన్, ఉప సర్పంచ్ తోట శివ సాయి, మండల కన్వీనర్ సుధాకర్ రాజు, హౌసింగ్ ఏఈ మురళి, రాజేంద్ర, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.














Comments