నూతన మంత్రివర్గంలో కొరముట్ల పేరు ఖరారు
- PRASANNA ANDHRA

- Apr 10, 2022
- 1 min read
నూతన మంత్రివర్గంలో కొరముట్ల పేరు ఖరారు.

నూతన మంత్రివర్గంలో కడప జిల్లా నుంచి ఎవరికీ చోటు దక్కుతుందో అన్న తరుణంలో... రైల్వే కోడూరు నుంచి వరుసగా నాలుగు సార్లు వైసీపీ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా ఎన్నికై ముఖ్యమంత్రి తోనూ, నియోజకవర్గ నాయకులు తోనూ, ప్రజలతోనూ అత్యంత అభిమానం ఏర్పరుచుకున్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కొరముట్ల కు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నూతన మంత్రివర్గంలో బెర్త్ ఖరారు చేశారనీ పూర్తి వినికిడి.

దీనితో రేపటి రోజున ప్రమాణస్వీకారం జరగనున్న నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు, రైల్వే కోడూరు నియోజకవర్గ పరిధిలోని రాజకీయ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున రాజధానికి చేరుకుంటున్నారు.

జిల్లా విషయంలో నిరాశగా ఉన్న ప్రజలకు ఈ వార్త కాస్త సంతోష విషయం అయినప్పటికీ.. మంత్రి పదవి పొందనున్న కొరముట్ల శ్రీనివాసులు కు శుభాకాంక్షలు తెలుపుతూ.. అభివృద్ధి విషయంలో ఇకనైనా ప్రత్యేక దృష్టి సారించి దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని ప్రజలు వేయి కన్నులతో వేచి చూస్తున్నారు.









Comments