top of page

పిల్లలు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలి - కొరముట్ల

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 30, 2022
  • 1 min read

ఆర్ఎస్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం రైల్వేకోడూరు పట్టణంలోని లక్ష్మీ నరసింహ కళ్యాణమండపం నందు జరిగిన స్టేట్ టైక్వాండో లెవెల్ టోర్నమెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు ముఖ్యఅతిథిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ విద్యతో పాటు బాల్యంనుంచే పిల్లలకు క్రీడలు నేర్పించాలని ముఖ్యంగా బాలికలకు స్వయ ఆత్మరక్షణ పొందడానికి ఈ తైక్వాండో క్రీడా ఎంతగానో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ఇలాంటి క్రీడలను కోడూరు లో నిర్వహించడం అభినందనీయమని అందరికీ ఉపయోగ కరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో శాప్ ఏడి రమణ, జిల్లా స్పోర్ట్స్ సీఈవో రామచంద్రారెడ్డి, చీఫ్ కోచ్ భాషా మొహిద్దిన్, ఎంపీపీ ధ్వజ రెడ్డి, జడ్పిటిసి రత్నమ్మ, జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్ రెడ్డి, పట్టణ సీఐ విశ్వనాధ రెడ్డి,ఉప సర్పంచ్ తోట శివ సాయి, పట్టణ కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page