top of page

ప్రమాదం జరగడం అత్యంత బాధాకరం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Jul 23, 2023
  • 1 min read

ఎక్స్గ్రేషియా పంపిణీ లో ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు.

--బాధిత కుటుంబానికి కొరముట్ల పరామర్శ.

--10 లక్షల ఎక్స్గ్రేషియా చెక్కు అందవేత.

ree

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం చిన్నఓరంపాడు వద్ద శనివారం బస్సు, లారీ ఢీకొని పలువురు చనిపోవడం, మరికొందరు గాయపడడం అత్యంత బాధాకరమని ప్రభుత్వం విప్, శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. ఈ ప్రమాదంలో గాయపడి మృతి చెందిన చిట్వేలి మండలం,దేవ మాచుపల్లి పంచాయతీ, దొగ్గలపాడు గ్రామానికి చెందిన

ree

చెవ్వు వెంకటరెడ్డి కుమారుడు అమర్నాథ్ రెడ్డి(26) మృతదేహానికి ఆదివారం ఉదయం పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరైన 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా చెక్కును బాధిత కుటుంబానికి అందచేశారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి,మండల కన్వినర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైసీపీ సీనియర్ నాయకులు ఎల్వి మోహన్ రెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, మలిశెట్టి వెంకటరమణ,ఇంచార్జి ఆర్డీవో రంగస్వామి, తహసీల్దర్ శిరీష,జిల్లా టూరిజం డైరెక్టర్ సుధాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page