పలు అభివృద్ధి కార్యక్రమాల పనులు ప్రారంభించిన సర్పంచ్ కొనిరెడ్డి
- EDITOR

- Nov 21
- 1 min read
పలు అభివృద్ధి కార్యక్రమాల పనులు ప్రారంభించిన సర్పంచ్ కొనిరెడ్డి


వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు నియోజకవర్గ శాసనసభ్యులు నంద్యాల వరదరాజుల రెడ్డి ఆదేశాల మేరకు ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి నేడు పంచాయతీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను ప్రారంభించారు. ఇందులో భాగంగా రిలయన్స్ పెట్రోల్ పంపు వద్ద నుండి ఇరువైపుల దాదాపు 250 మీటర్ల తారు రోడ్డు, అలాగే టీచర్స్ కాలనీ నందు 200 మీటర్ల మురుగు కాలువల నిర్మాణాలు చేపట్టారు. అభివృద్ధి పనులను దగ్గర ఉండి పర్యవేక్షించిన సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్ర రెడ్డి.









Comments