లబ్ధిదారులకు బోరాసా ఇచ్చిన కొనిరెడ్డి
- PRASANNA ANDHRA

- Mar 7, 2022
- 1 min read
వై. ఎస్. ఆర్. కడప జిల్లా, ప్రొద్దటూరు, స్థానిక కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి కొత్త అమృత నగర్ సచివాలయం నందు ఈరోజు ఉదయం10 గంటలకు జగనన్న కాలనీలో ఇల్లు నిర్మించుటకు అవగాహన సదస్సు నిర్వహించిన కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు కొని రెడ్డి శివ చంద్రా రెడ్డి, ఈ కార్యక్రమంలో జగనన్న కాలనీలో ఇల్లు మంజూరు కాబడిన లబ్ధిదారులు పాల్గొన్నారు, ఇల్లు నిర్మించుకునేందుకు కావలసిన నీటి కనెక్షన్, కరెంటు కనెక్షన్ ఇతరత్రా ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తామని కొనిరెడ్డి లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలోM.R.O నజీర్ అహ్మద్, RWS AE భరత్, కొత్తపల్లె పంచాయతీ సెక్రెటరీ పుల్లారెడ్డి, MPDO సుబ్రహ్మణ్యం, స్పెషల్ ఆఫీసర్లు, ఎంపిటిసిలు, వార్డు మెంబర్లు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.














Comments