జిల్లా పంచాయతీ సర్పంచుల సంఘం కార్యాలయం ప్రారంభించిన కొనిరెడ్డి
- PRASANNA ANDHRA

- Feb 19, 2022
- 1 min read
కడప జిల్లా సర్పంచ్ సంఘం కార్యాలయం ప్రారంభించిన జిల్లా అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి, జిల్లా పంచాయతీ సర్పంచ్ ల సంఘం కార్యాలయాన్ని సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడు కొని రెడ్డి శివ చంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని సర్పంచులు సమస్యలను పరిష్కరించడానికి కార్యాలయం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.... సర్పంచులు తమ సమస్యలను పరిష్కరించుకోవడానీకి వారానికి రెండుమార్లు కార్యాలయంలో సమావేశం జరుగుతుందని తెలిపారు. ఎవరైనా వెంటనే కార్యాలయానికి ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చని తెలిపారు సర్పంచులు సంఘటితంగా ఉండి సమస్యలను కార్యాలయం దృష్టికి తీసుకు వచ్చిన ఎడల సంఘం తరఫున పరిష్కరించడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని తెలిపాన డి.పి.ఓ.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ సర్పంచులు తమ సమస్యలు పరిష్కారం కోసం కార్యాలయం ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకో వాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సంఘం జనరల్ సెక్రెటరీ మత్తయ్య, ట్రెజర్ కొండయ్య, ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి, డి ఎల్ పి వో లు, కడప మస్తాన్వలి, రాజంపేట నాగరాజు, ఆర్గనైజర్ టీ ప్రభాకర్ నాయుడు, సర్పంచులు తక్కోలి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.










Comments