ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇస్తే మేము సహకరించం - అసమ్మతి వర్గం
- PRASANNA ANDHRA

- Jan 26, 2024
- 1 min read
ఎమ్మెల్యే రాచమల్లుకు టికెట్ ఇస్తే మేము సహకరించం. అసమ్మతి వర్గం

కడప జిల్లా
ప్రొద్దుటూరు నియోజకవర్గ ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ టికెట్ ఇస్తే తాము సహకరించము అని, ప్రొద్దుటూరు కు చెందిన వైసీపీ అసమ్మతి వర్గ నేతలు కొత్తపల్లి పంచాయతి సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, వైసీపీ బహిష్కృత 5వ వార్డు కౌన్సిలర్ వంగనూరు మురళీధర్ రెడ్డి, 13వ వైసిపి కౌన్సిలర్ ఇర్ఫాన్ భాష, 19వ వార్డు కౌన్సిలర్ మునీర్, వెళ్లాల మాజీ జడ్పిటిసి భాస్కర్, వైసీపీ నాయకుడు పొట్టు లక్ష్మిరెడ్డి బహిరంగంగానే ప్రకటించారు. ఎన్నో సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న నాయకుల కన్న మధ్యలో వచ్చిన వారికే పదవులు, వారికే సత్కారాలు అన్న చందంగా ప్రొద్దుటూరులో ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి వ్యవహరిస్తున్నారని అసమ్మతి నేతలు వారి అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఎమ్మెల్యే రాచమల్లు కు టికెట్ ఇస్తే మీరు సహకరిస్తారా అన్న పాత్రికేయుల ప్రశ్నకు నాయకులు సమాధానం ఇస్తూ ముఖ్యమంత్రి జగన్ మాటే తమకు శిరోధార్యమని, పార్టీకి అంకితభావంతో పనిచేస్తామని ఇక్కడ సమాధానం ఇవ్వడం కోసమెరుపు. ఏది ఏమైనా రానున్న ఎన్నికలలో మరోమారు వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి తీరుతామని వారు హామీ ఇచ్చారు.








Comments