ఓటీఎస్ తో సొంతింటి కల సాకారం - కొనిరెడ్డి
- PRASANNA ANDHRA

- Jan 10, 2022
- 1 min read
ప్రొద్దుటూరు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన ఒన్ టైం సెటిల్ మెంట్ (ఓటీఎస్ తో పేదల సొంతింటి కల సాకారం అవుతోందని కొత్తపల్లి సర్పంచ్, జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొని రెడ్డి శివ చంద్రారెడ్డి అన్నారు. సోమవారం ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లి పంచాయతీ పరిధిలో పలువురు మహిళలకు ఓటీఎస్ పథకం కింద రూ.పది వేలు కట్టించుకుని వారికి ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తమ సోదరులకు దివంగత కొని రెడ్డి రామ చంద్రారెడ్డి సర్పంచ్ గా ఉన్నప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారని తెలిపారు. నేడు కొత్త పల్లె కు చెందిన కె. దేవి, చింతల జయమ్మ, షేక్ ఖైరున్ బీ అనే ముగ్గురు మహిళలు ఓటీఎస్ పథకం కింద సొంతింటి కలను సాకారం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరింత మంది ముందుకు వచ్చి ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.












Comments