top of page

ఆర్థిక సాయం చేయూతనందించిన కొనిరెడ్డి ఫౌండేషన్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jun 26, 2022
  • 1 min read

ఆర్థిక సాయం చేయూతనందించిన కొనిరెడ్డి ఫౌండేషన్


వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


ఉప్పరపల్లె, రోజువారీ కూలీ పని చేసుకొని జీవనం సాగిస్తున్న యాకోబు గత నెల మైదుకూరు దగ్గరలో రోడ్డు ప్రమాదానికి గురి కాగా తీవ్రంగా గాయపడ్డాడు. యాకోబుకు భార్య, ముగ్గురు కూతుర్లు ఒక్క కొడుకు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన యాకోబును స్థానిక ఆసుపత్రిలో చికిత్స అనంతరం మెరుగయిన వైద్యం కోసం కర్నూలుకు తరలించారు. వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న యాకోబు మంచానికి పరిమితమయ్యాడు, కుటుంబ దీనావస్థను గమనించిన అతని బంధువులు 'కొనిరెడ్డి ఫౌండేషన్' వ్యవస్థాపక అధ్యక్షుడు, కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రా రెడ్డి దృష్టికి యాకోబు దీనావస్థను తీసుకువెళ్లారు. ఫౌండేషన్ ద్వారా నేడు కొనిరెడ్డి ఇరవై అయిదు వేల రూపాయల ఆర్ధిక సాయాన్ని ఉప్పరపల్లె లోని యాకోబు నివాసానికి వెళ్లి అందించటం జరిగింది.

ree

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో యాకోబు కుటుంబ పోషణ, వైద్య ఖర్చుల నిమిత్తం ఇరవై అయిదు వేల రూపాయ ఆర్ధిక సాయం చేశామని, రాబోవు రోజుల్లో మరికొంత ఆర్థిక సాయం చేయనున్నామని, రేపు యాకోబుకు మరోసారి వైద్య పరీక్షలు నిర్వహించి ఆపరేషన్ అవసరమయితే అందుకు కూడా తామ ఫౌండేషన్ ముందుంటుందని, యాకోబు త్వరగా కోలుకోవాలని ఈ సందర్బంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కొణిరెడ్డి ఫౌండేషన్ సభ్యులు, ఉప్పరపల్లె వాసులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page