top of page

కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో చలివేంద్రం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 5, 2023
  • 1 min read

ree
ree

కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరో చలివేంద్రం

ree

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


పట్టణంలోని శివాలయం వీధి, సుధా హాలు వద్ద బుధవారం ఉదయం కొనిరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు, కొత్తపల్లి పంచాయతీ సర్పంచ్, కడప జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడు కొనిరెడ్డి శివచంద్రారెడ్డి అధ్యక్షతన చలివేంద్రం ఏర్పాటు చేయగా, నియోజకవర్గ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కొనిరెడ్డి మాట్లాడుతూ, గత కొన్ని సంవత్సరాలుగా పట్టణంలోని వివిధ ప్రాంతాలలో చల్లటి మజ్జిగ, త్రాగునీటి చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో భాగంగా ఇప్పటికి పట్టణంలో రెండు చలివేంద్రాలు ప్రారంభించగా, నేడు ఎమ్మెల్యే రాచమల్లు చేతుల మీదుగా మరో చలివేంద్రాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు.

ree

ప్రజలకు సేవ చేయటంలో తాను తమ ఫౌండేషన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటామని నిరంతర సేవే తమ మార్గం అని ఆయన చెప్పుకొచ్చారు, గతంలో కొని రెడ్డి ఫౌండేషన్ స్థాపించక మునుపు పలు సేవా కార్యక్రమాలు చేశామని ముఖ్యంగా వేసవికాలంలో త్రాగునీరు అందం గ్రామాలకు తన వంతు సహాయంగా మంచినీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి ఇంటింటికి త్రాగునీటిని అందించామని గుర్తు చేసుకున్నారు. రాబోవు రోజుల్లో తమ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో రాచమల్లు కిరణ్ కుమార్ రెడ్డి, నరాల రామారెడ్డి, పద్మశాలి కార్పొరేషన్ చైర్మన్ జింక లక్ష్మీదేవి, యువ నాయకులు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ree


4 Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Apr 05, 2023
Rated 5 out of 5 stars.

Good

Like

Guest
Apr 05, 2023
Rated 5 out of 5 stars.

Super koni reddy anna

Like

Guest
Apr 05, 2023
Rated 5 out of 5 stars.

Good job

Like

Guest
Apr 05, 2023
Rated 5 out of 5 stars.

God bless you

Like
bottom of page