top of page

పేద ప్రజల సంక్షేమానికి సహాయ సహకారాలు అందిస్తా - కే.కే. రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 24, 2023
  • 1 min read

పేద ప్రజల సంక్షేమానికి సహాయ సహకారాలు అందిస్తా - కే.కే. రెడ్డి

ree

రాజంపేట: పేద ప్రజల సంక్షేమానికి తమ వంతు బాధ్యతగా, జన్మనిచ్చిన పెద్ద కారంపల్లి పంచాయతీ అభివృద్ధికి సహాయ, సహకారాలు అందించడానికి ఎప్పుడు ముందు ఉంటానని పెద్ద కారంపల్లికి చెందిన ప్రవాసాంధ్రలు కే.కే. రెడ్డి అన్నారు. మంగళవారం పెద్ద కరంపల్లి ఎంపీటీసీ వరద రాజుతో కలిసి కే.కే. రెడ్డి నివాసంలో కలిసి పెద్ద కారంపల్లి పంచాయతీ అభివృద్ధిపై చర్చించారు. ఈ సందర్భంగా కే.కే. రెడ్డి మాట్లాడుతూ పుట్టి పెరిగిన, సొంతూరి అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమానికి తన వంతు ఆర్థిక సహాయ సహకారాలు అందించడానికి అన్నివేల ముందు ఉంటానని భరోసా ఇచ్చారు. ప్రధానంగా పెద్దకాయంపల్లిలో నిర్మాణంలో ఉన్న ఆలయ అభివృద్ధికి, తాగునీటి కోసం, విద్యాభివృద్ధి కోసం ఆర్థిక సహాయ సహకారాలు అందిస్తామన్నారు. పంచాయతీలో ఉన్నటువంటి ప్రధానమైన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పేద ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కేకే రెడ్డి సోదరుడు సుబ్బారెడ్డి, శివరామిరెడ్డి, నారాయణరెడ్డి, సుబొద్ రెడ్డి పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page