వై కోట లో పి వి ఎస్ మూర్తి ఆధ్వర్యంలో పండుగలా.. కిట్లు, బీమా పత్రాల పంపిణీ.
- DORA SWAMY

- Jun 19, 2022
- 1 min read
ప్రతి కార్యకర్త పార్టీ పటిస్టానికి కృషి చేయాలి.
కిట్లు,భీమా పత్రాల పంపిణీ లో పివీఎస్ మూర్తి.

అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం వై కోట గ్రామం నందు "టీం జనసేన వై కోట" ఆధ్వర్యంలో జనసేన క్రియాశీలక సభ్యత్వం కిట్లు మరియు బీమా పత్రాలు పంపిణీ కార్యక్రమం ఘనంగా ఒక పండుగ వాతావరణం లో నిర్వహించడం జరిగింది.

వై కోట గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి అతిధులుగా సీనియర్ జనసేన నాయకులు పివియస్ మూర్తి , రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర , రాజంపేట సీనియర్ నాయకులు ఎం వెంకటేశ్వర్లు రావ్, జనసేన కడప జిల్లా లీగల్ సెల్ ఇంచార్జ్ కరుణాకర్ రాజు , కడప జిల్లా నాయకులు , రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండలం, చిట్వేల్ మండలం మరియు కోడూరు మండలం సైనికులు, జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు..

పి వి ఎస్ మూర్తి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయ సిద్ధాంతాలను మరియు జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న టీం జనసేన వై కోట సభ్యులను అభినందించడం జరిగింది. ప్రతి కార్యకర్త మరింతగా కృషిచేసి అన్ని వర్గాలను కలుపుకుంటూ పార్టీ ఎదుగుదలకు పాటుపడాలని సూచించారు.

తాతం శెట్టి నాగేంద్ర మరియు ఇతరులు మాట్లాడుతూ పార్టీ కార్యకర్తల శ్రేయస్సుకోసం అధినేత పవన్ కళ్యాణ్ భీమా నిర్ణయం తీసుకున్నారని ఇది ప్రతి ఒక్కరికి ఎంతగానో ఉపయోగకరమని అన్నారు.

పి వి ఎస్ మూర్తి ఆధ్వర్యంలో వైసిపి మరియు టిడిపి కార్యకర్తలు జనసేన పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.








Comments