top of page

విశాఖ KGH లో దయనీయ పరిస్థితి

  • Writer: EDITOR
    EDITOR
  • Jun 19, 2024
  • 1 min read

విశాఖ KGH లో దయనీయ పరిస్థితి

ree
ఆక్సిజన్ సిలిండర్ ను భుజాన వేసుకొని నర్సు వెంట నడుస్తున్న శిశువు తండ్రి విష్ణుమూర్తి

Watch Video Here...

ree

నెలలు నిండని కన్న బిడ్డ కోసం ఓ తండ్రి తాపత్రయం, ఆక్సిజన్ సిలిండర్ ను భుజాన మోయాల్సిన దుస్థితి, ప్రఖ్యాతిగాంచిన విశాఖ కేజీహెచ్ లో నెలలు నిండని బిడ్డ ఆరోగ్యం కోసం ఓ తండ్రి పడిన కష్టం సామాజిక మధ్యమాల్లో వైరల్ అవుతోంది.


తూర్పుగోదావరి జిల్లా కోటనందూరుకు చెందిన అల్లు శిరీష అనే గర్భిణిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించగా నెలలు నిండకుండానే ఓ బిడ్డకు జన్మనివ్వడంతో ఆ శిశువును పిల్లల NICU వార్డులో ఉంచాలని వైద్యులు సూచించారు. దీంతో ఆ పసికందుకు ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయు వార్డుకు నర్సు బిడ్డను పట్టుకొని ముందు నడవగా... శిశువు తండ్రి అల్లు విష్ణుమూర్తి ఆక్సిజన్ సిలిండర్ ను భుజాన వేసుకొని ఆమె వెంట నడిచారు. ఉత్తరాంధ్రలోనే అత్యంత కీలకమైన KGH లో కనీసం స్ట్రెచ్చర్ సౌకర్యాలు కొరవడటం... బాధాకరం...


ఈ ఘటనను వీడియో తీసిన కొందరు సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. దీనిపై ఆసుపత్రి పర్యవేక్షక వైద్యాధికారి డాక్టర్ శివానంద ఆరా తీశారు. వైద్యులు, సిబ్బందిని పిలిచి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకూడదని ఆదేశించారు. ఇక నుంచి బ్యాటరీ వాహనాన్ని అందుబాటులో తెస్తామన్నారు.

ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page