కె.సి పుల్లయ్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో జాతీయ పురస్కారాలు, ఉపకారవేతనాలు
- PRASANNA ANDHRA

- Mar 22, 2022
- 1 min read
Updated: Mar 23, 2022
వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు కేంద్రంగా స్థాపించబడిన కె.సి పుల్లయ్య ఫౌండేషన్ అధినేత స్వర్గీయ కె.సి పుల్లయ్య దశమ వర్ధంతి సంస్మరణ సభ ఈరోజు ప్రొద్దటూరులోని కె.సి పుల్లయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు నిర్వహించారు, ఈ సందర్భంగా కె.సి పుల్లయ్య స్మారక జాతీయ పురస్కారాలు పలువురు సామాజిక సేవాతత్పరులకు అందచేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కడప జిల్లా కలెక్టర్ వి. విజయ రామరాజు ఐ.ఏ.ఎస్, కొండూరు అజయ్ రెడ్డి APSSDC, కుప్పం ప్రసాద్ చైర్మన్ ఏపీ ఆర్యవైశ్య కార్పొరేషన్, టి. మారుతీ ప్రసాద్ టీటీడీ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు, ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ కె.సి పుల్లయ్య ఫౌండేషన్ సేవలను కొనియాడారు. కడప జిల్లా కలెక్టర్ వి. విజయ రామరాజు ఐ.ఏ.ఎస్ మాట్లాడుతూ విద్యార్థులు విద్య పట్ల సరయిన అవగాహన కలిగివుండాలి, విద్యా ఉపాధి ఉద్యోగాలు ఒక ప్రాంతానికి ఒక పట్టణానికె పరిమితం కావని, విద్యార్థులు ఉన్న వనరులు ఉపయోగించుకొని తమ నైపుణ్యానికి పదును పెట్టాలని హితబోధ చేశారు.

అనంతరం కె.సి పుల్లయ్య స్మారక జాతీయ పురస్కార గ్రహీతలకు సన్మానం ప్రశంసా పత్రాలు కలెక్టర్ చేతుల మీదుగా అందచేశారు శ్రీమతి డా. మనాబి బంద్యోపాధ్యాయ (కలకత్తా, పశ్చిమ బెంగాల్) కి విద్యారత్న అవార్డు, స్వరూప్ శివ (త్రిసూర్, కేరళ) కి కళారత్న అవార్డు, కుమారి డా. తేజేస్విని మనోజ్ఞ (హైదరాబాద్, తెలంగాణ) కి సేవారత్న అవార్డు, లక్ష్మి నరసింహ రావు ఇక్కుర్తి (గుంటూరు, ఆంధ్రప్రదేశ్) కి హరిత రత్న అవార్డులను అందచేశారు. అలాగే ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అయిదు వందల పేద విద్యార్థిని విద్యార్థులకు ఉపకార వేతనాలు అందించారు.
కె.సి పుల్లయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక సభ్యులు శ్రీమతి కె. కృష్ణవేణమ్మ, కె. అనిల్ కుమార్, కె. సుశీల్ కుమార్, పి. వాసుదేవ రావు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు.








Comments