విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న విద్యాశాఖ అధికారి కార్యాలయ సిబ్బంది
- PRASANNA ANDHRA

- 3 days ago
- 1 min read
విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న కడప జిల్లా మండల విద్యాశాఖ అధికారి వారి కార్యాలయం సిబ్బందిపై వెంటనే చర్యలు తీసుకోవాలని విద్యార్థి యువజన సంఘాల డిమాండ్

కడప
స్థానిక కడప పట్టణంలోని కడప మండల విద్యాశాఖ అధికారి కార్యాలయానికి ఉదయం 11:30 గంటల సమయం అవుతున్న ఇంతవరకు అధికారులు గానీ కార్యాలయ సిబ్బంది గానీ కనిపించిన పరిస్థితి లేదు. కార్యాలయం వద్దకు విద్యార్థి యువజన సంఘాలుగా రాగా ఉదయం 11:30 గంటల సమయం అవుతున్న తాళాలు వేసి ఉండటం నిర్లక్ష్యమేనని విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. మా జీతాలు మేము తీసుకుంటాము విధులకైతే హాజరుకాలేము అనే విధంగా ఈరోజు కడప మండల విద్యాశాఖ అధికారి రఫీక్ వారి సిబ్బంది ఉన్నారని ఆరోపించారు.
ఈ విషయమై జిల్లా డీఈవో, ఆర్జెడి లకు ఫిర్యాదు చేసిన వారు ఇంత వరకు మండల ఎంఈఓ అధికారులపై కార్యాలయ సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు? విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న మండల విద్యాశాఖ అధికారులపై కార్యాలయ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రగతిశీల విద్యార్థి యువజన సమైక్య రాష్ట్ర కన్వీనర్ కత్తి ఓబులేసు, తెలుగు రాష్ట్ర విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జయరాజ్, రాయలసీమ స్టూడెంట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బందెల ఓబులేసు, డెమొక్రటిక్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రియాజ్, పూల వెంకట్ లు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, రాష్ట్ర విద్యాశాఖ అధికారులను, కమీషనర్, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు లను కోరడం జరుగుతుందని అన్నారు.








Comments