కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం
- EDITOR

- May 8, 2023
- 1 min read
కర్ణాటకలో ముగిసిన ఎన్నికల ప్రచారం


కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగిసింది. ఇప్పటివరకు దద్దరిల్లిన మైకులు సోమవారం సాయంత్రం 5 గంటల తరువాత చిన్నబోయాయి. అయితే ఇప్పటికే ప్రధాన పార్టీలు గెలుపుపై లెక్కలు వేసుకున్నాయి.

అధికారం తమదంటే తమదని కాంగ్రెస్, బీజేపీ గట్టి నమ్మకంతో ఉంది. ఇక బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతలు ప్రచారాన్ని మరో స్థాయికి తీసుకెళ్లారు. బీజేపీ నుండి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా పలువురు కీలక నాయకులు విస్తృత ప్రచారం చేశారు. అలాగే కాంగ్రెస్ నుండి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఖర్గే వంటి నాయకులు ప్రచారం నిర్వహించారు. దీనితో కర్ణాటక ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి. మే 10న కర్ణాటక ఎన్నికలు జరగనుండగా..13న ఫలితాలు వెలువడనున్నాయి.









Good information