top of page

రైల్వేకోడూరులో ఘనంగా కాపు సంక్షేమ సేన ద్వితీయ వార్షికోత్సవ సంబరాలు.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Aug 9, 2022
  • 1 min read

ఘనంగా కాపు సంక్షేమసేన ద్వితీయ వార్షికోత్సవం సంబరాలు

అన్నమయ్య జిల్లా,రైల్వే కోడూరు కాపు సంక్షేమ సేన నియోజకవర్గ కార్యాలయంలో కాపు సంక్షేమ యువసేన నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల కిషోర్ ఆధ్వర్యంలో కాపు సంక్షేమ సేన రాష్ట్ర కార్యనిర్వాహక కమిటీ సభ్యులు ఎద్దల అనంత రాయలు ముఖ్యఅతిథిగా కాపు సంక్షేమ సేన ద్వితీయ వార్షికోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు.

ree

ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన కాపు సంక్షేమ సేన నియోజకవర్గ అధ్యక్షులుగా ఎన్నికైన సుంకర రవిచంద్ర ను ఘనంగాసన్మానించారు.అనంతరం కార్యక్రమానికి విచేసిన కాపు సంక్షేమ సేన నాయకులు కేక్ కట్ చేసి, వ్యవస్థాపకులు మాజీ హోం మంత్రివర్యులు చేగోండి హరిరామ జోగయ్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సంక్షేమసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఆగస్టు 9వ తేదీన జరుగుతున్న ద్వితీయ వార్షికోత్సవ సంబరాలలో భాగంగా రైల్వేకోడూరు లో కూడా నిర్వహించడం జరిగిందని,ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ,రానున్న రోజుల్లో కాపు సంక్షేమ సేన ద్వారా బలిజ,ఒంటరి,తెలగ వర్గీయులతోపాటు ఇతర సామాజిక వర్గాలను కూడా కలుపుకొని ముందుకు సాగి కాపు బలిజల ఐక్యత ఇది అని చాటి చెప్పే వరకు గ్రామస్థాయి నుండి క్షేత్రస్థాయి వరకు బలోపేతం చేస్తామని ఈ సందర్భంగా వీరు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో కాపు పెద్దలు ఉత్తరాది శివకుమార్,అంకిశెట్టి మణి, కొర్లకుంట శంకరయ్య, తుపాకుల శంకర్,మర్రి రెడ్డి ప్రసాద్,కాపు సంక్షేమ యువసేన నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు పగడాల మణి ప్రసాద్,శ్రీకరం ప్రకాష్, కొర్లగుంట గిరిధర్, సాయం శ్రీధర్, ఎద్దల ఈశ్వరయ్య, రవికుమార్ మరియు సవరం ప్రసాద్, సవరం సాయి పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page