డీసీసీ ఎంపికలో పారదర్శకతే లక్ష్యం - కన్యాకుమారి ఎంపీ హెచ్. విజయ్ వసంత్
- EDITOR

- Nov 28
- 1 min read
డీసీసీ ఎంపికలో పారదర్శకతే లక్ష్యం - కన్యాకుమారి ఎంపీ హెచ్. విజయ్ వసంత్

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ ఎస్.ఇర్ఫాన్ బాషా కార్యాలయంలో ఎంపీ హెచ్. విజయ్ వసంత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. డీసీసీ అపాయింట్మెంట్ ప్రక్రియను తాను పర్యవేక్షిస్తున్నానని తెలిపారు. మండల, క్షేత్ర స్థాయి నుండి నాయకుల అభిప్రాయాల ఆధారంగా డీసీసీ ఎన్నిక నిర్వహించనున్నట్లు చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నడిపించటం లక్ష్యమని వెల్లడించారు. తన పర్యటన పూర్తిగా డీసీసీ నియామకంపై నాయకులు, కార్యకర్తలను కలుసుకోవడానికేనని ఎంపీ విజయ్ వసంత్ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ సంఘటనా సృజన కార్యక్రమాన్ని జిల్లాలో ప్రారంభిస్తున్నట్లు జిల్లా డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో సమావేశంలో ఆమె మాట్లాడుతూ, రాహుల్ గాంధీ సూచనల మేరకు డిసిసి అభ్యర్థిగా సరైన నాయకుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. నాయకుల అభిప్రాయాలతో జిల్లా అధ్యక్షుల ఎంపిక జరుగుతుందని వివరించారు. ప్రస్తుత ప్రభుత్వం ప్రజలు, రైతులను పూర్తిగా పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి పనిచేస్తుందని విజయ జ్యోతి స్పష్టం చేశారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు ఇన్చార్జ్ ఇర్ఫాన్ భాషా మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న సంఘటనా సృజన కార్యక్రమం ప్రధాన ఉద్దేశం డీసీసీ పదవిని పారదర్శకంగా ఎన్నుకోవడమేనని ఆయన తెలిపారు. పార్టీకి సంబంధించిన కార్యకర్త, నాయకులు డీసీసీ పదవికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందన్నారు. జిల్లా డీసీసీ అధ్యక్షురాలు విజయ జ్యోతికి తమ పూర్తి మద్దతు ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో పార్టీకి సంబంధించి కొన్ని సమస్యలు ఉన్నాయన్న విషయాన్ని అంగీకరించారు. రాహుల్ గాంధీని ప్రధాని, వైఎస్ షర్మిలను సీఎం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని ఇర్ఫాన్ బాషా వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.









Comments