top of page

కాకర్లకు సముచిత స్థానం

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 28, 2023
  • 1 min read

కాకర్లకు సముచిత స్థానం

సమావేశంలో మాట్లాడుతున్న రాచమల్లు, కాకర్ల
ree

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


తాజాగా రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ గా నియమితులైన ప్రొద్దుటూరు నియోజకవర్గ వైసిపి సీనియర్ నాయకులు న్యాయవాది కాకర్ల నాగ శేషారెడ్డి శుక్రవారం ఉదయం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ, ముందుగా నియోజకవర్గ శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని, పదవికి వన్నె తెచ్చి ప్రజలకు సేవ చేస్తానని ఆయన తెలిపారు.

ree

ఈ సందర్భంగా శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, స్వతహాగా న్యాయవాది అయిన కాకర్ల నాగ శేషారెడ్డికి సముచిత స్థానం గౌరవం కల్పించారని, వైయస్సార్సీపి పాలనలో ప్రజా సౌలభ్యం కొరకు కొత్త పద్ధతులు అవలంబించి పలు సంస్కరణలు ముఖ్యమంత్రి జగన్ చేపట్టారని, అందులో భాగంగానే రిటైర్డ్ జడ్జ్ వెంకట రమణారెడ్డి చైర్మన్ గా డిస్ట్రిక్ట్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మరో సంస్కరణలో భాగం అని, ప్రజలకు పోలీసు వ్యవస్థను చేరువ చేసే ఉద్దేశంతో, అలాగే ప్రజలకు సరైన న్యాయం అందించటం కోసం రాయలసీమ ఎనిమిది జిల్లాలకు నాగ శేషారెడ్డిని ఈ కమిటీల్లో మెంబర్ గా నియమించారని, అందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మరోమారు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆయన తెలిపారు.

ree

1 Comment

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
Guest
Apr 28, 2023
Rated 5 out of 5 stars.

Congratulations Sir

Like
bottom of page