top of page

కడప ఆర్డీవోకు ఉత్తమ ఈఆర్ఓ రాష్ట్ర స్థాయి అవార్డు

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Jan 25, 2022
  • 1 min read

ree

కడప జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కడప ఆర్డీవో పి.ధర్మచంద్రారెడ్డి ఉత్తమ ఈఆర్వో రాష్ట్ర స్థాయి అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ఆయనకు ఎలెక్షన్ ఓటరు జాబితా-2021 సవరణలో భాగంగా అత్యుత్తమ ప్రతిభ కనబరచినందుకు ఇవ్వటం జరిగింది. రాజధాని అమరావతిలో రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి విజయానంద్ చేతుల మీదుగా నేడు మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ అవార్డును అందుకున్నారు. అవార్డుతో పాటు రూ.10 వేలు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం, జ్ఞాపికను అందుకున్నారు పి.ధర్మచంద్రారెడ్డి.


ఈ సందర్బంగా పి.ధర్మచంద్రారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన కలెక్టర్లు, ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ అందించే బెస్ట్ మెరిటోరియల్ అవార్డుల ప్రదానోత్సవంలో వర్చువల్ విధానంలో హాజరైన రాష్ట్ర గవర్నర్ హాజరు కాగా, వారి సమక్షంలో ఎన్నికల ప్రధానాధికారి విజయానంద్ అవార్డును బహుకరించడం జరిగిందన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page