“మన కడప – స్వచ్ఛ కడప” కార్యక్రమాన్ని పునఃసమీక్షించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి
- EDITOR

- Nov 20
- 1 min read
కడప నగరంలో “మన కడప – స్వచ్ఛ కడప” కార్యక్రమాన్ని పునఃసమీక్షించిన ఎమ్మెల్యే మాధవి రెడ్డి

కడప కార్పొరేషన్, 28వ డివిజన్ మాచుపల్లి బస్టాండ్ పరిధిలో నిన్న నిర్వహించిన “మన కడప – స్వచ్ఛ కడప” కార్యక్రమం తర్వాత, ఈ రోజు ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే రెడ్డెప్పగారి మాధవి రెడ్డి మరలా ఆ ప్రాంతాన్ని సందర్శించి శుభ్రత, పౌరసౌకర్యాల నిర్వహణపై పునఃసమీక్ష చేశారు.
ఈ సందర్శనలో భాగంగా నిన్న గుర్తించిన చెత్త నిల్వలు, డ్రైనేజ్ క్లాగింగ్, వీధుల శుభ్రత మరియు ఇతర సమస్యలపై తీసుకున్న చర్యలను సమీక్షించారు. అలాగే, ప్రాంతంలో ఉన్న అక్రమ నిర్మాణాల తొలగింపు చర్యలను కూడా మాధవి రెడ్డి గారు ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ, భవిష్యత్తులో ఇలా అక్రమంగా నిర్మాణాలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
స్థానికులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకుంటూ, మున్సిపల్ సిబ్బందికి అవసరమైన చోట్ల మరింత శ్రద్ధతో శుభ్రత పనులు కొనసాగించాలని సూచించారు. కడప నగరాన్ని శుభ్రమైన, ఆరోగ్యవంతమైన, అభివృద్ధి దిశగా నిలపడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, “మన కడప – స్వచ్ఛ కడప” కార్యక్రమం నిరంతరంగా కొనసాగుతుందని మాధవి రెడ్డి తెలిపారు.









Comments