హెవిహా (మ్యాక్స్ వెల్ బయోసైన్సెస్ అమెరికా వారి అనుబంధ సంస్థ) తో ఏపికార్ల్ ఒప్పందం
- PRASANNA ANDHRA

- Nov 21
- 1 min read
హెవిహా (మ్యాక్స్ వెల్ బయోసైన్సెస్ అమెరికా వారి అనుబంధ సంస్థ) తో ఏపికార్ల్ ఒప్పందం

వైయస్సార్ కడప, నవంబర్ 21:
జిల్లా లో విదేశీ పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు మ్యాక్స్ వెల్ బయోసైన్సెస్ అమెరికా వారి అనుబంధ సంస్థ హెవిహా,ఏపీ కార్ల్ వారితో ఒప్పందం చేసుకున్నట్లు జిల్లా కలెక్టరు శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు.
శుక్రవారం స్థానిక కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్ నందు మ్యాక్స్ వెల్ బయోసైన్సెస్ అమెరికా వారి అనుబంధ సంస్థ హెవిహా ప్రతినిధి డా.చేతన్ టమహంకర్ తో పులివెందుల నియోజకవర్గంలోని ఏపీ కార్ల్ తరఫున చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ శ్రీనివాస ప్రసాద్ జిల్లా కలెక్టరు ఆధ్వర్యంలో ఎంవోయూ ఒప్పందాలు కుదుర్చు కున్నారు.
ఒప్పందం ముఖ్యాంశాలు:
ప్రాథమికంగా రానున్న ఆరు మాసాలలో రూ.30 కోట్ల పెట్టుబడితో రిసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ల్యాబ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. తద్వారా దాదాపు 50 మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయన్నారు.దశల వారీగా మరో 4 సంవత్సరాలలో రూ. 2 వేల కోట్ల పెట్టుబడితో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్నాయన్నారు. ఇప్పటికే ఈ మ్యాక్స్ వెల్ బయోసైన్సెస్ సంస్థ అమెరికా రక్షణ సంస్థ తోటి ఏడు ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇటువంటి సంస్థ మన దేశంలో మొదటిసారిగా ఇక్కడ పెట్టుబడి పెడుతోందన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు డా.శ్రీధర్ చెరుకూరి సంస్థ ప్రతినిధులతో మాట్లాడుతూ, ప్రభుత్వ పరంగా కావల్సినటువంటి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. పులివెందుల-బెంగళూరు అంతర్జాతీయవిమానాశ్రాయానికి దగ్గరగా ఉండడంతో పాటు జాతీయ రహదారులు అభివృద్ధి చెంది ఉండడంతో తక్కువ ప్రయాణ సమయం తీసుకోవడం వలన విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ఎక్కువ అవకాశాలు కలవన్నారు. ఈ ఒప్పంద పత్రం కార్యరూపం దాల్చడానికి ఏపి రెరా మాజీ చైర్మన్ రామనాథ్ వెలమాటి, మినిస్ట్రీ ఎంఎస్ఎంఇ టెక్నికల్ అడ్వైజర్ శంకర్ ప్రసాద్, అగ్రికల్చర్ & పశు సంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ బి.రాజశేఖర్ మరియు జిల్లా కలెక్టరు చెరుకూరి శ్రీధర్ సంయుక్త కృషి వలన ఈ ఒప్పంద పత్రం కార్యరూపం దాల్చినదని ఏపి కార్ల్ చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ ప్రొఫెసర్ శ్రీనివాస ప్రసాద్ తెలిపారు.
ఈ ఎంఓయూ కార్యక్రమంలో ఏపి కార్ల్ శాస్రవేత్త డా.శివ ప్రసాద్, అడ్మిన్ లక్ష్మి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.








Comments