వినాయకచవితి రోజున వింత చోటుచేసుకుంది
- PRASANNA ANDHRA

- Sep 1, 2022
- 1 min read
కడప జిల్లా బద్వేల్ మండలం బాలాయపల్లిలో వినాయకచవితి రోజున ఓ వింత చోటు చేసుకుంది. బాలాయపల్లికి చెందిన మన్నెం శంకర్ రెడ్డి అనే రైతు ఇంట్లో గేదెకు రెండు తలల దూడ పుట్టింది. వినాయక చవితి రోజున రెండు తలల దూడ పుట్టడంతో దాన్నొక అద్భుతంగా భావిస్తున్నారు. అయితే గేదె, రెండు తలల దూడ క్షేమంగా ఉన్నాయి. వినాయక చవితి పండగ రోజున రెండు తలల దూడ జన్మించడం ఆదృష్టంగా భావిస్తున్నారు రైతు శంకర్‌రెడ్డి.

వింత దూడను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భారీగా తరలివస్తున్నారు. దైవ మహిమ వల్లే ఇలా జరిగిందని గ్రామస్తులు అంటున్నారు. జన్యు పరమైన సమస్యల కారణంగానే ఇలా జరుగుతుందని పశువైద్యులు చెబుతున్నారు. ఇలా జన్యు లోపాలతో జన్మించే జీవుల మనుగడ కష్టం అని తెలిపారు. కాగా ఇలా వింత దూడలు జన్మించిన సందర్భాల గురించి మనం అరుదుగా వింటూనే ఉంటాం. ఆ బుల్లి దూడ ఆరోగ్యం బాగుండాలని మనం కోరుకుందాం.







Comments