కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం, ముగ్గురు మృతి
- PRASANNA ANDHRA

- May 22, 2022
- 1 min read
కడప జిల్లా, కడప- తాడిపత్రి ప్రధాన రహదారిలో ఘోర రోడ్డు ప్రమాదం. రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి, మరణించిన వారిలో ఇద్దరు తల్లీ కూతుళ్లు. కర్మలవారి పల్లె గ్రామ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది, ఆగివున్న ఉన్న లారీని అతివేగంగా వచ్చిన కారు ఢీకొంది. ఈ ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృత్యువాత పడ్డారు.
ఈ ఘటన అర్ధరాత్రి 12 గంటల సమయంలో జరిగినట్టుగా సమాచారం, మృతులు మైలవరం మండలం దొమ్మర నంద్యాల గ్రామానికి చెందిన వారుగా గుర్తింపు. వెంకటసుబ్బయ్య, లక్ష్మీ మునెమ్మ, వెంక సుబ్బమ్మలు అక్కడికక్కడే మృతి చెందగా. స్వల్ప గాయాలతో డ్రైవర్ తో పాటు ఒక చిన్నారి బయటపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
















Comments