విధిగా పిల్లలకు కరోనా టీకాలు వేయించాలి - షేక్ మొహమ్మెద్ రిజ్వాన్ బాషా
- PRASANNA ANDHRA

- Mar 26, 2022
- 1 min read
వై.ఎస్.ఆర్ కడప జిల్లా, కడప పట్టణం నందు 29వ వార్డు మునిసిపల్ ఉర్దూ బాలికల ఉన్నత పాఠశాలలో 12 నుండి 14 వయసు గల విద్యార్థినులకు కోవిద్ టీకాలు వేయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కడప 29వ వార్డు కార్పొరేటర్ షేక్ మొహమ్మెద్ రిజ్వాన్ బాషా పాల్గొన్నగా, డాక్టర్ హసీనా ఆధ్వర్యంలో పిల్లలకు టీకాలు వేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కరోనా మహమ్మారి వలన ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లిందని, రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టి ప్రతిఒక్కరికి కోవిద్ టీకాలు ఉచితంగా వేస్తున్నారని, ఇప్పుడు 12 నుండి 14 యేండ్ల వయసు గల పిల్లలకు టీకాలు వేస్తుండటంతో ప్రతి ఒక్కరు విధిగా తమ పిల్లలకు టీకాలు వేయించి, కరోనా మహమ్మారిని ప్రాలద్రోలాలని కోరారు.









Comments