కానపల్లెలో మోరీ నిర్మాణానికి భూమిపూజ
- PRASANNA ANDHRA

- Feb 8, 2023
- 1 min read
వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
వైఎస్ఆర్సిపి హయాంలో పంచాయతీలు అభివృద్దే ధ్యేయంగా, గ్రామాభివృద్దే లక్ష్యంగా తమ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు.

బుధవారం ఉదయం కొత్తపల్లి పంచాయతీ పరిధిలోని కానపల్లి గ్రామంలో, పదిహేను లక్షల రూపాయల పంచాయతి నిధులతో మడూరు కాలువపై మోరీ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే రాచమల్లు భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వైసీపీ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, ప్రజలకు మౌలిక వసతుల కల్పనలో భాగంగా నేడు కనపల్లె గ్రామంలోని మడూరు కాలువపై మోరీ నిర్మాణం చేపడుతున్నామని, గత పాతిక సంవత్సరాలుగా ఇక్కడి గ్రామ ప్రజలు మోరీ నిర్మించక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, యుద్దప్రాతిపదిక మీద త్వరలో మోరీ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో కొత్తపల్లె పంచాయతీ సర్పంచ్ కొనిరెడ్డి శివ చంద్రా రెడ్డి, మూడవ వార్డు మెంబెర్ కొనిరెడ్డి రమణా రెడ్డి, యువ నాయకుడు కొనిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి, పలువురు వైసీపీ నాయకులు, కానపల్లె గ్రామ ప్రజలు పాల్గొన్నారు.








Comments