చంద్రబాబు జగన్ పవన్ కంటే నాకే ప్రజాదరణ - కేఏపాల్
- PRASANNA ANDHRA

- Jul 31, 2022
- 1 min read
చంద్రబాబు జగన్ పవన్ కంటే నాకే ప్రజాదరణ - కేఏపాల్...
తెలంగాణలో సీఎం కేసీఆర్ ను, కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించాల్సిన అవసరం ఉందని ప్రజా శాంతి అధినేత కే ఏ పాల్ అన్నారు. తెలంగాణలో తనకు 30 లక్షలకు ఓటర్లు పెరిగారని చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల తనకే ఎక్కువగా మద్దతు ఇస్తున్నారని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తెలిపారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రస్తుత సీఎం జగన్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ మంది ప్రజలు నన్నే సీఎంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారని చెప్పారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయిన జగన్, కేసీఆర్ ఇద్దరూ కలిసి ప్రయాణిస్తే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందేవని అన్నారు. కానీ వారిద్దరూ చెరో దారిలో పయనిస్తున్నారని తెలిపారు. దానికి వారు ఒప్పుకోవడం లేదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రంలోనూ తనకు మద్దతు దారులు పెరిగారని కేఏ పాల్ చెప్పారు. ‘‘తెలంగాణ నాపై దాడి జరిగిన నాటి నుంచి ఇక్కడ పొలిటికల్ స్ట్రక్చర్ మారిపోయింది. ఈ ఒక్క ఘటనతో నాకు దాదాపు 30 లక్షలకు పైగా ఓట్లు పెరిగాయి’’ అని పాల్ అన్నారు.








Comments