ఘనంగా కొండేటి వెంకటరమణ జన్మదిన వేడుకలు.
- DORA SWAMY

- May 23, 2022
- 1 min read
ఘనంగా వార్డ్ మెంబర్ కొండేటి వెంకటరమణ జన్మదిన వేడుకలు
--శుభాకాంక్షలు తెలిపిన పలువురు జనసేన నాయకులు.

అన్నమయ్య జిల్లా,రైల్వే కోడూరు మండల పరిధిలోని జంగిటి వారి పల్లి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో త్రిముఖ పోటీలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని జనసేన పార్టీ తరఫున వార్డ్ మెంబర్ గా గెలిచి యువతకు ఆదర్శంగా నిలిచిన కొండేటి వెంకటరమణ సోమవారం జన్మదినం సందర్భంగా జనసేన నాయకులు మర్రి రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు ఉత్తరాది శివకుమార్,జనసేన దళిత నాయకులు నగరపాటి మహేష్, డేగల మహేశ్వర పాల్గొని వెంకటరమణ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా కొండేటి వెంకటరమణ మాట్లాడుతూ జనసేన పార్టీ తరఫున నేను వార్డ్ మెంబర్ గా గెలిచి, వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించి ఈరోజు యువతకు ఆదర్శంగా నిలిచినందుకు ఎంతో గర్వకారణంగా ఉందని, నా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క జన సైనికుడికి ఆత్మీయులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అని తెలిపారు.








Comments