పార్టీ బలోపేతమే లక్ష్యం - మలిశెట్టి
- EDITOR

- Mar 24, 2023
- 1 min read
పార్టీ బలోపేతమే లక్ష్యం - మలిశెట్టి వెంకటరమణ

ప్రసన్న ఆంధ్ర -రాజంపేట :
నియోజకవర్గంలో జనసేన పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యమని జనసేన పార్టీ రాజంపేట అసెంబ్లీ ఇన్చార్జి మలిశెట్టి వెంకటరమణ తెలియజేశారు. అమెరికా నుండి స్వదేశానికి వచ్చిన మలిశెట్టి వెంకటరమణను శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు, పవన్ కళ్యాణ్ అభిమానులు, కుల సంఘ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని బలపరుస్తామని.. పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు.

ఈ సందర్బంగా మలిశెట్టి వెంకటరమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ జనసేన వైపు చూస్తున్నారని అన్నారు. రాజంపేటలో జనసేన పార్టీ బలోపేతం కోసం శక్తి వంచన లేకుండా పోరాడి పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్తానని.. రాష్ట్రంలో జనసేన అధికారమే లక్ష్యంగా ముందుకెళ్లడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి పల్లె జనసేన నాయకులు కోలాటం హరి, కొండ్లోపల్లె నరసింహ తదితరులు పాల్గొన్నారు.








Comments