రేపు రైల్వేకోడూరులో పర్యటించనున్న జనసేన పార్టీ పిఎసిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్
- DORA SWAMY

- Apr 9, 2022
- 1 min read

రేపు రైల్వేకోడూరులో పర్యటించనున్న జనసేన పార్టీ పిఎసిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్ - విజయవంతం చెయ్యాలని కోరిన చిట్వేల్ జనసేన నాయకులు మాదాసు నరసింహ.

రైల్వేకోడూరు నియోజకవర్గంలో ఈనెల 10వ తేదీ ఆదివారం అనగా రేపటి రోజున జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు రైల్వేకోడూరుకు చేరుకుని మామిడికాయల యార్డ్ సమీపంలో ఏర్పాటు చేసిన పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించి,జెండా ఆవిష్కరణ చేపడతారనీ అనంతరం స్థానిక రైతులతో ముఖాముఖిగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారనీ జనసేన పార్టీ మహిళా ఉపాధి మేళా కార్యక్రమంలో భాగంగా పార్టీ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు పంపిణీ చేస్తారనీ, క్రియాశీలక సభ్యత్వం నమోదు ప్రక్రియలో అత్యధిక సభ్యత్వ నమోదు చేసిన వారికి మెమొంటో లు బహూకరిస్తారనీ;అనంతరం కడప జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగిస్తారనీ తెలుపుతూ.. అలాగే ఈ కార్యక్రమానికి చిట్వేలు మండలం జనసేన కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ సభను విజయవంతం చేయాలని చిట్వేల్ జనసేన నాయకులు మాదాసు నరసింహ కోరారు.












Comments