top of page

ప్రొద్దుటూరు జనసేన పార్టీ అధ్యక్షుడిగా పత్తి శివ కళ్యాణ్ రెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Nov 13, 2023
  • 1 min read

ప్రొద్దుటూరు జనసేన పార్టీ భాధ్యుడిగా పత్తి శివ కళ్యాణ్ రెడ్డి

ree
ree

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ బాధ్యుడిగా పత్తి శివ కళ్యాణ్ రెడ్డిని జనసేన పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం కడప జిల్లా వారిగా బాధ్యుల జాబితాను పార్టీ అధిష్టానం విడుదల చేసింది.


తెలుగుదేశం పార్టీల మధ్య నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణకు జనసేన పక్షాన బాధ్యులను నియమించారు. వీరి నియామకానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ఆమోదం తెలిపారు. ఉభయ పక్షాల సమావేశాలు, ఉమ్మడి కార్యక్రమాల నిర్వహణను- 'పాయింట్ ఆఫ్ కాంటాక్ట్' గా నియమితులైన వీరు సమన్వయపరుస్తారు.


ఈ నెల 14వ తేదీ నుంచి మూడు రోజులపాటు ఉభయ పక్షాల నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. ఇటీవల విజయవాడలో నిర్వహించిన సమన్వయ సమావేశంలో ఖరారు చేసిన అజెండా ప్రకారం క్షేత్ర స్థాయిలో చేపట్టే కార్యక్రమాలను ఉమ్మడిగా ముందుకు తీసుకువెళ్లడంపై ఇరు పక్షాల నేతలు. నియోజకవర్గ ఆత్మీయ సమావేశాలలో శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారు. 17వ తేదీ నుంచి నియోజకవర్గ స్థాయిలో జరగబోయే ఇంటింటికీ కార్యక్రమం... భవిష్యత్తుకు గ్యారంటీ మరియు ఓటర్ లిస్ట్ పరిశీలన తదితర అంశాలను విజయవంతం చేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తారు.

ree
ree
ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page