top of page

జనసేన పార్టీ బలోపేతం దిశగా విస్తృత కార్యక్రమం.

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • May 21, 2022
  • 1 min read

--అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి పని చేయడమే జనసేనల లక్ష్యం.


--త్వరలో కడప జిల్లాకు రానున్న జనసేన అధినేత.


ree


జనసేన పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్వేలి పట్టణంలో జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను కలిసి చిట్వేలి మండలంలో పార్టీ బలోపేతం పై జనసేన పార్టీ రాష్ట్ర ప్రోగ్రామ్స్ కమిటీ జనరల్ సెక్రటరీ మరియు చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు భవాని కుమార్, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర మరియు చిరంజీవి యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు చలపతి మండలంలో పార్టీ బలోపేతం పై చర్చించారు.


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద,బడుగు,బలహీన, నిరుద్యోగ, రైతన్నల, మహిళల ఇలా అన్ని వర్గాల వారి క్షేమం కోసం వెనుదిరగని అలుపెరగని పోరాటం కొనసాగిస్తున్న పవన్ కళ్యాణ్ ని.. రానున్న సార్వత్రిక ఎన్నికలలో అన్ని వర్గాలను కలుపుకుని వారందరిని చల్లని దీవెనలతో జనసేన అధినేత ను ముఖ్యమంత్రిగా చూడాలన్నది మా ఆశయం అని పేర్కొన్నారు. త్వరలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కడప జిల్లా పర్యటన ఉంటుందని తెలిపారు.


ఈ కార్యక్రమంలో చిట్వేలి జనసేన నాయుకులు మాదాసు నరసింహ, మాదాసు శివ, కంచర్ల సుధీర్ రెడ్డి, పగడాల శివ శంకర్, సువారపు హరి తదితరులు పాల్గొన్నారు..

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page