జగన్ పోవాలి - పవన్ రావాలి - జనసేన
- PRASANNA ANDHRA

- Nov 25, 2022
- 1 min read
జగన్ పోవాలి - పవన్ రావాలి
రాజంపేట, రాష్ట్రంలో జగన్ పోవాలి, పవన్ రావాలి అని రాజంపేట జనసేన నాయకులు పేర్కొన్నారు. బద్వేల్ నియోజకవర్గం, పోరిమామిళ్ల మండలం నుంచి జనసేన నాయకులు జగన్ పోవాలి పవన్ రావాలి అనే సంకల్పంతో తిరుమలకు పాదయాత్రగా వెళ్లడం జరుగుతోంది. రెండవ రోజు పాదయాత్ర రాజంపేటకు చేరుకున్న సందర్భంగా శుక్రవారం రాజంపేట జనసేన నాయకులు బోయినపల్లిలోని వై జంక్షన్ వద్ద పాదయాత్రగా వెళుతున్న జనసైనికులను కలిసి స్వాగతం పలికారు. జగన్ పోవాలి, పవన్ రావాలి అంటూ నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి, అరాచక పాలన తొలగిపోయి స్వచ్ఛమైన పవన్ పాలన రావాలని తిరుమల వేంకటేశ్వరున్ని ప్రార్థిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పోరుమామిళ్ల జనసేన నాయకులు వెంకటేష్, కడప జిల్లా ప్రోగ్రామ్ కమిటీ సభ్యులు శీలంశెట్టి లక్ష్మయ్య, మండల నాయకులు సి.పి నరసింహ, బద్వేల్ యువ నాయకులు సుండుపల్లె రెడ్డి రాణి, సానిపాయ నాయకులు గుగ్గిళ్ళ నాగార్జున, రాజంపేట నాయకులు పోలిశెట్టి శ్రీనివాసులు, వీరయ్య ఆచారి, శంకరయ్య, రవి, మల్లికార్జున, వీర మహిళలు పాల్గొన్నారు.









Comments