జనసేన నాయకుడు యలటూరి శ్రీనివాసరాజు కు జనం నీరాజనం
- EDITOR

- Dec 7, 2023
- 1 min read
జనసేన నాయకుడు యలటూరి శ్రీనివాసరాజు కు జనం నీరాజనం

జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో పార్టీలో చేరి గురువారం విజయవాడ నుండి రాజంపేట కు వచ్చిన రాష్ట్ర టీఆర్డీఏ మాజీ ఉన్నతాధికారి యలటూరి శ్రీనివాస్ రాజుకు నందలూరు ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆయన ఉదయం 10 గంటలకు సిద్ధవటం నుండి భారీ జన సమీకరణాల మధ్య కాన్వాయ్ తో బయలుదేరి వస్తున్న సంగతి తెలుసుకున్న మండల వాసులు బస్టాండ్ కూడలి లో ఆయనకు ఘన స్వాగతం పలికి పూలమాలలతో ఆహ్వానించారు. ఆయన కాన్వాయ్ ని ఆపి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మండల ప్రజలకు తనకిచ్చిన ఈ అపూర్వ స్వాగతానికి మనసు నిండా ఎంత సంతోషంగా ఉందని ఎప్పటికీ నందలూరు మండల రుణం తీర్చుకోలేనని జనసేన పార్టీ నాయకుని ఆదేశాల మేరకు పార్టీ బలోపేతానికి తాను కృషి చేస్తానని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేశారు. గత నాలుగు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం ప్రజలకు మరియు నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమి లేదని దోచుకో దాచుకో అన్న రీతిలో నాయకులు ఉన్నారని రాబోవు ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. నియోజకవర్గం లోని అన్ని ప్రాంతాల ప్రజలను కలుపుకొని పోయి పార్టీని ముందుకు తీసుకునీ పోతానని అందరికీ అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను తీర్చేందుకు తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి శివరామరాజు , మాజీ నాగిరెడ్డిపల్లి మేజర్ పంచాయతీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, జన సైనికులు ప్రజలు అభిమానులు పాల్గొన్నారు.









Comments