top of page

రైతు కుటుంబాలకు జనసేన పార్టీ రూ.లక్ష సాయం - పవన్ కళ్యాణ్

  • Writer: PRASANNA ANDHRA
    PRASANNA ANDHRA
  • Apr 2, 2022
  • 1 min read

రైతు కుటుంబాలకు జనసేన పార్టీ రూ.లక్ష సాయం, నేరుగా రంగంలోకి పవన్ కళ్యాణ్.

ree

ప్రతి రైతు కుటుంబాన్ని పరామర్శిస్తానన్న పవన్ కళ్యాణ్, అన్నదాతల పరిస్థితి చూసి బాధపడ్డానన్న జనసేనాని, అందుకే వారికి అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

ree

ఏపీలో రైతులకు అండగా నిలిచింది జనసేన పార్టీ, అన్నదాతల కోసం నేరుగా అధినేత పవన్ కళ్యాణ్రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబాన్నీ త్వరలోనే పరామర్శిస్తానని జనసేనాని ప్రకటించారు. అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాల్లోనే 80 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, వ్యవసాయాన్ని నమ్ముకున్నవారి పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.


రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు పంట నష్టాలతో ఆత్మహత్యలు చేసుకోవడం ఆవేదనకు గురిచేసిందన్నారు. ప్రాణాలు తీసుకున్న రైతు కుటుంబాలలోని పిల్లల చదువులకు, ఇతర అవసరాలకు కొంతైనా అండగా నిలబడాలని కీలక నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఆ కుటుంబాలకు రూ.లక్ష సాయం చేస్తున్నామని. ఆర్థిక సాయం అందించే ప్రక్రియ కూడా మొదలవుతుందన్నారు. ఉగాది పూట ఆ రైతుల కుటుంబాలు బాధతో ఉండకూడదనే వారికి కొంతైనా ఊరటనిచ్చేలా జనసేన తరపున ఆర్థిక సాయం అందిస్తున్నట్లు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page