top of page

వరద బాధిత కుటుంబానికి జనసేన ఆర్ధిక సాయం

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 1, 2023
  • 1 min read

వరద బాధిత కుటుంబానికి జనసేన ఆర్ధిక సాయం

ఆర్థిక సాయం అందజేస్తున్న జనసేన నాయకులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


మండలం పరిధిలోని రామచంద్రాపురం గ్రామంలో చెయ్యేరు వరద బాధితునికి జనసేన పార్టీ రాజంపేట ఇంచార్జి మలిశెట్టి వెంకట రమణ ప్రతినిధులు బుధవారం చెయ్యరు వరద బాధిత కుటుంబానికి ఇంటి నిర్మాణానికి 75 వేలు అందజేశారు. 2021 నవంబర్ లో చెయ్యేరుకు వరద పోటెత్తడంతో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి పరీవాహక ప్రాంతాలలో అపార ఆస్తి, ప్రాణ నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. ఇందులో శివారెడ్డి అనే బాధితుడు ఇళ్లు, పశువులు, భూమి సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలాడు. కొడుకు, కూతురు తో కలిసి చిన్న తాత్కాలిక ప్లాస్టిక్ పరదాల ఇంటిలో దుర్భర జీవనం గడుపుతున్నాడు. అధికార పార్టీ నేతలను, అధికారులను కలిసినా ఎవరూ సహాయం చేయక పోవడంతో జనసేన ఇంచార్జి మలిశెట్టి వెంకట రమణ ముందుకు వచ్చి సహాయం అందించారు.

ree

ఇందులో భాగంగా కుటుంబ పోషణ కోసం గతంలో రూ 25 లు ఇవ్వగా, ఇంటి నిర్మాణం కోసం రూ 75 వేలు బుధవారం మలిశెట్టి వెంకట రమణ రాయల్ ప్రతినిధులు బాధితుడికి అందజేశారు. ఎవరూ పట్టించుకోని తమ కష్టాలను జనసేన గుర్తించి సహాయం చేయడం పట్ల బాధిత కుటుంబం ఈ సందర్భంగా హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ లీగల్ సెల్ ఉపాధ్యక్షుడు కత్తి సుబ్బరాయుడు, జనసేన నాయకులు భాస్కర పంతులు, వెంకటయ్య, పోలిశెట్టి శ్రీనివాసులు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.

ree

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page