విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త
- PRASANNA ANDHRA

- Oct 22, 2022
- 1 min read

విజయవాడ వెళ్లే ప్రయాణికులకు శుభవార్త

జమ్మలమడుగు మరియు ప్రొద్దుటూరు , చుట్టుపక్కల గ్రామాల నుండి విజయవాడకు వెళ్ళు ప్రయాణికుల సౌకర్యార్థం కొరకు జమ్మలమడుగు ఎ.పి.యస్.ఆర్.టీ.సీ వారు జమ్మలమడుగు నుండి విజయవాడకు సూపర్ లగ్జరీ బస్సు, ప్రొద్దుటూరు నుండి గుంటూరు వరకు మరియు విజయవాడ నుండి వచ్చునపుడు గుంటూరు నుండి ప్రొద్దుటూరు వరకు నాన్ స్టాప్ సర్వీస్ (6191) ఏర్పాటు చేయటం జరిగినది. జమ్మలమడుగు లో రాత్రి 9:30 బయల్దేరి , ప్రొద్దుటూరు ఆర్టీసీ బస్టాండ్ 10:20 కి వచ్చి, 10:30 కి బయలుదేరును. రిజర్వేషన్ సౌక్యరం కలదు సర్వీస్ నెంబర్ (6191).ఆర్టీసీ ప్రయాణం సురక్షితం కావున ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డిపో మేనేజర్ యన్. రామ సుబ్బయ్య ,ఆసీస్టెంట్ మేనేజర్ బి. పెద్ది రాజు ఒక ప్రకటనలో తెలిపారు.









Comments