జమాఅతె ఇస్లామి హింద్ "పొరగు వారి హక్కులు" దేశవ్యాప్త ఉద్యమం
- EDITOR

- Nov 20
- 1 min read
జమాఅతె ఇస్లామి హింద్ "పొరగు వారి హక్కులు" దేశవ్యాప్త ఉద్యమం

వైయస్సార్ కడప జిల్లా, ప్రొద్దుటూరు
ఈరోజు ఉదయం 10-00గం"లకు జమాఅతె ఇస్లామి హింద్ ప్రొద్దుటూరు శాఖ ఆధ్వర్యంలో, స్థానిక జిన్నారోడ్ లోని జమాఅత్ కార్యాలయం లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశంలో జమాఅతె ఇస్లామి హింద్ రాష్ట్ర సలహా మండలి సభ్యులు ఎన్.ఎస్. మొహిద్దీన్ మాట్లాడుతూ, ప్రస్తుతం సమాజంలో స్వార్థం పెరిగిపోవడంతో ప్రజలకు తమ ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి అని, ఇరుగు పొరుగు వారి గురించి ఆలోచించే వారు కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
జమాఅతె ఇస్లామిహింద్ "పొరగు వారి హక్కులు" అనే నినాదంతో 21-11-2025 తేదీ నుండి 30-11-2025 తేదీ వరకు 10రోజులు దేశ వ్యాప్త ఉద్యమం నిర్వహిస్తున్నది అని తెలిపారు. ఈ పది రోజులు తమ క్యాడర్ డోర్ టు డోర్ కార్యక్రమాలు, కరపత్రాలు, వాల్ పోస్టర్ల, సోషల్ మీడియా, లఘు చిత్రాల ద్వార పొరుగు వారి హక్కులను తెలపడం జరుగతుందని తద్వారా ఒక ఆదర్శ సమాజం ఏర్పడే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతరం ఉద్యమ కరపత్రాలను, వాల్ పోస్టర్లు, ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జమాఅత్ పట్టణ అధ్యక్షులు జనాబ్ షఫివుల్లాహ్ గారు, కడప జిల్లా అధ్యక్షులు జనాబ్ రహమతుల్లాహ్, స్థానిక ఉద్యమ కన్వీనర్ అబ్దుసమద్, మహిళా విభాగం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.









Comments