డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ విగ్రహ ఆవిష్కరణ
- PRASANNA ANDHRA

- Apr 5, 2022
- 1 min read

పెంటపాడు (బిల్ల గుంట), డాక్టర్ బాబు జగ్జీవన్ రావ్ 114 జయంతి సందర్భంగా బిల్ల గుంట గ్రామంలో విగ్రహ ఆవిష్కరణ దళిత డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కళింగ లక్ష్మణరావు. పాలూరి భాస్కర్ రావు . గుండుబోగుల సాంబయ్య చేతుల మీదగా విగ్రహావిష్కరణ ఘనంగా జరిగింది. ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా కళింగ లక్ష్మణరావు మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రావ్ అట్టడుగు వర్గాల ప్రజల కోసం విశేషంగా కృషిచేశారు అని .హక్కుల కోసం పోరాటం చేశారు అని, కార్మిక శాఖ మంత్రిగా కార్మికులకు చట్టాల అమలు కోసం కృషి చేసిన వ్యక్తి. వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసి ప్రజలకు ఆహారం గిడ్డంగులు నిర్మించిన వ్యక్తి అని ఆయన అన్నారు. రాజ్యాంగ కమిటీలో సభ్యుడిగా దళితులకు కావలసిన అంశాలు పొందుపరచడం కృషి చేయడం జరిగింది. పార్లమెంట్లో 1936 నుండి 1986 మరణించే వరకు దాదాపు యాభై సంవత్సరాలు పార్లమెంట్ లో ఉన్నారు. నిమ్న జాతుల హక్కులకోసం పార్లమెంట్లో తన కృషి చేశారు. దేశానికి ఒక ఉప ప్రధాని అయ్యారు. అనేక శాఖలకు మంత్రిగా పనిచేశారు అని ఆయన అన్నారు.








Comments