వైభవంగా ప్రారంభమైన శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు జయంతి ఉత్సవాలు
- EDITOR

- Apr 23, 2023
- 1 min read
వైభవంగా ప్రారంభమైన శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు జయంతి ఉత్సవాలు


ప్రసన్న ఆంధ్ర, రాజంపేట
స్థానిక శంకరమఠంలో శ్రీ శ్రీ శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్యులు వారి జయంతి మహోత్సవములు ఆదివారం ఉదయం కలశ స్థాపనతో ఘనంగా ప్రారంభమాయ్యాయి. అద్వైత సమితి వేద పండితులు అవధానం రాజశేఖర శర్మ ఆధ్వర్యంలో అద్వైత సమితి అధ్యక్షులు పి.వల్లభరావు దంపతులు నేతృత్వంలో గణపతి పూజ, స్వస్తి పుణ్యాహ వచనం, గణపతి హోమం, మూలవరులకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, భక్తులచే గురు పాదుకాపూజ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమాలలో కోశాధికారి శ్రీకాంత్, విజయకృష్ణ , వై.యస్ జయసింహ, అమ్మవారి శాల అర్చకులు సుబ్బరాయుడు దంపతులు, సాయిబాబా దేవస్థానం విజయ్ కుమార్, అన్నదానం దినేష్ కుమార్, సోమశేఖర శర్మ, శంకరమఠం ప్రధాన అర్చకులు చోరగుడి దశరథ రామ శర్మ తదితరులు పాల్గొన్నారు.









Comments